
ఏపీలో త్వరలో వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలు: సిఎస్
బి వి ఆర్ టుడే న్యూస్ అమరావతి..
ఏపీ రాష్ట్రంలో వాట్సప్ ద్వారా త్వరలో 150 రకాల పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వివిధ శాఖలు తమ పనితీరు మెరుగుపరచు కోవడానికి వీలుగా ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారాన్ని అందించాలని తెలిపారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖతోనూ ఆర్టీజీఎస్ సమన్వయం చేసుకోవాలని సీఎస్ ఆదేశించారు.