*సీఎం చంద్రబాబును కలిసిన నితీష్ కుమార్ రెడ్డి* బివిఆర్ టుడే న్యూస్ అమరావతి.ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన నితీష్ కుమార్ రెడ్డి, నితీష్ తండ్రి ముత్యాల రెడ్డినితీష్ సెంచరీ సాధించిన తర్వాత ACA ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును నితీశ్ కుమార్ రెడ్డికి అందజేసిన సీఎం చంద్రబాబు*
రికార్డు స్థాయిలో టెంకాయల వేలంపాట..బాట సుంకలమ్మ…
గుత్తి:: రికార్డు స్థాయిలో టెంకాయల వేలంపాట..బాట సుంకలమ్మ..
బి వి ఆర్ టుడే న్యూస్:: గుత్తి
గుత్తి మండలంలోని కరడికొండ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బాట సుంకులమ్మ దేవాలయం వద్ద టెంకాయల వేలంపేట నిర్వహించారు టెంకాయలు వేలంపాట రికార్డు స్థాయిలో పలికింది గత సంవత్సరం రూపాయలు 28 లక్షలు వేలంపాట పొగ కడప జిల్లా పొద్దుటూరు మండలానికి చెందిన పుల్లయ్య ఏకంగా రూపాయల 35. లక్షల 60 వేల దక్కించుకున్నారు గత ఏడాది కంటే ఈ సంవత్సరం రూపాయలు 7. లక్షల 60 వేల రూపాయలు ఆదాయం చేకూరింది. గ్రామ ప్రజల హర్షం వ్యక్తం చేశారు
ఏపీలో త్వరలో వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలు: సిఎస్
ఏపీలో త్వరలో వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలు: సిఎస్
బి వి ఆర్ టుడే న్యూస్ అమరావతి..
ఏపీ రాష్ట్రంలో వాట్సప్ ద్వారా త్వరలో 150 రకాల పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వివిధ శాఖలు తమ పనితీరు మెరుగుపరచు కోవడానికి వీలుగా ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారాన్ని అందించాలని తెలిపారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖతోనూ ఆర్టీజీఎస్ సమన్వయం చేసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
వానరం దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ భక్తుడు…– చోద్యం చూస్తూ మానవత్వంను విస్మరించిన ఓ దేవస్థానం అధికారి…
వానరం దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ భక్తుడు…– చోద్యం చూస్తూ మానవత్వంను విస్మరించిన ఓ దేవస్థానం అధికారి…–
ఓ ఆర్.ఎం.పి. వైద్య సేవలతో మానవత్వం చాటుకున్న స్థానికులు..
.బి.వి.ఆర్. టుడే న్యూస్,జనవరి 7, గుంతకల్లు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో మంగళవారం ఓ వానరం దాడిలో ఓ భక్తుడు తీవ్రంగా గాయపడిన సంఘటన చోటు చేసుకుంది. సదరు సంఘటనపై స్థానికుల కథనం మేరకు… దేవస్థానం ముఖద్వారం సమీపంలోని విశేష పూజల టికెట్ల విక్రయ కేంద్రం ప్రక్కన శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కుళాయిల వద్ద ఇరు (రెండు) వానరాలు ఘర్షణ పడ్డాయన్నారు. సదరు ఘర్షణలో అటువైపుగా శ్రీవారి దర్శనంకై వెళ్తున్న ఓ భక్తుడుపై ఓ వానరం దాడి చేసి తీవ్రంగా గాయపరిచిందన్నారు. దీంతో స్థానికులు సదరు వానరంను తరిమి వేసి రక్త గాయాలతో క్షతగాత్రుడైన ఆ భక్తుడిని చేరదీసి గ్రామంలోని ఓ ఆర్ఎంపి వైద్యుడి సహాయంతో వైద్య చికిత్స సేవలు అందించి మానవత్వం చాటుకున్నారు. ఇదిలా ఉండగా సదరు వానరం దాడి సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ భక్తుడి పట్ల స్థానికుల కథనం , బాధితుడి రోదనలు ఏమాత్రం పట్టించుకోకుండా తాను దేవస్థానం ఉద్యోగినన్న కనీస ధర్మం పాటించకుండా మానవత్వంను విస్మరిస్తూ అటువైపు చోద్యం చూస్తూ వెళ్లడం పట్ల స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మానవత్వంను విస్మరించిన దేవస్థానం సదరు ఉద్యోగి సీనియర్ అసిస్టెంట్ వెంకటనారాయణ బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిన తీరు హేయంగా ఉందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం విశేషం. కాగా కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంకు యాత్రికులుగా విచ్చేయు శ్రీవారి భక్తుల సౌకర్యార్థం వారి భద్రతల పట్ల దేవస్థానం విధి నిర్వహణ బాధ్యతలలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగాను, అలసత్వం తీరుగా ఉందని స్థానికులు బహిరంగంగా ఆరోపణలు విమర్శలు చేస్తుండడం విచారకరం. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనల పట్ల రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి సదరు దేవస్థానం అధికారులు, సిబ్బంది విధినిర్వహణలో భక్తులకు ఎలాంటి అభద్రతలకు తావివ్వకుండా అసౌకర్యం కలుగకుండా అప్రమత్తతో తగుచర్యలు తీసుకునేలా ఆదేశాల పాటింపుకు చొరవ చూపాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని స్థానికంగా భక్తులు డిమాండ్ చేస్తుండడం గమనార్హం. సదరు ఉద్యోగిని వివరణ కోరగా నాకేం తెలియదంటూ చెప్పారు.
వానరం దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ భక్తుడు…– చోద్యం చూస్తూ మానవత్వంను విస్మరించిన ఓ దేవస్థానం అధికారి…–
వానరం దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ భక్తుడు…– చోద్యం చూస్తూ మానవత్వంను విస్మరించిన ఓ దేవస్థానం అధికారి…–
ఓ ఆర్.ఎం.పి. వైద్య సేవలతో మానవత్వం చాటుకున్న స్థానికులు…
బి.వి.ఆర్. టుడే న్యూస్,జనవరి 7, గుంతకల్లు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో మంగళవారం ఓ వానరం దాడిలో ఓ భక్తుడు తీవ్రంగా గాయపడిన సంఘటన చోటు చేసుకుంది. సదరు సంఘటనపై స్థానికుల కథనం మేరకు… దేవస్థానం ముఖద్వారం సమీపంలోని విశేష పూజల టికెట్ల విక్రయ కేంద్రం ప్రక్కన శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కుళాయిల వద్ద ఇరు (రెండు) వానరాలు ఘర్షణ పడ్డాయన్నారు. సదరు ఘర్షణలో అటువైపుగా శ్రీవారి దర్శనంకై వెళ్తున్న ఓ భక్తుడుపై ఓ వానరం దాడి చేసి తీవ్రంగా గాయపరిచిందన్నారు. దీంతో స్థానికులు సదరు వానరంను తరిమి వేసి రక్త గాయాలతో క్షతగాత్రుడైన ఆ భక్తుడిని చేరదీసి గ్రామంలోని ఓ ఆర్ఎంపి వైద్యుడి సహాయంతో వైద్య చికిత్స సేవలు అందించి మానవత్వం చాటుకున్నారు. ఇదిలా ఉండగా సదరు వానరం దాడి సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ భక్తుడి పట్ల స్థానికుల కథనం , బాధితుడి రోదనలు ఏమాత్రం పట్టించుకోకుండా తాను దేవస్థానం ఉద్యోగినన్న కనీస ధర్మం పాటించకుండా మానవత్వంను విస్మరిస్తూ అటువైపు చోద్యం చూస్తూ వెళ్లడం పట్ల స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మానవత్వంను విస్మరించిన దేవస్థానం సదరు ఉద్యోగి సీనియర్ అసిస్టెంట్ వెంకటనారాయణ బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిన తీరు హేయంగా ఉందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం విశేషం. కాగా కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంకు యాత్రికులుగా విచ్చేయు శ్రీవారి భక్తుల సౌకర్యార్థం వారి భద్రతల పట్ల దేవస్థానం విధి నిర్వహణ బాధ్యతలలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగాను, అలసత్వం తీరుగా ఉందని స్థానికులు బహిరంగంగా ఆరోపణలు విమర్శలు చేస్తుండడం విచారకరం. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనల పట్ల రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి సదరు దేవస్థానం అధికారులు, సిబ్బంది విధినిర్వహణలో భక్తులకు ఎలాంటి అభద్రతలకు తావివ్వకుండా అసౌకర్యం కలుగకుండా అప్రమత్తతో తగుచర్యలు తీసుకునేలా ఆదేశాల పాటింపుకు చొరవ చూపాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని స్థానికంగా భక్తులు డిమాండ్ చేస్తుండడం గమనార్హం.
రెవిన్యూ డివిజనల్ అధికారికి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించిన దివ్యాంగులు…
రెవిన్యూ డివిజనల్ అధికారికి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించిన దివ్యాంగులు…
బివిఆర్ టుడే న్యూస్, జనవరి 7
రాజమహేంద్రవరం
: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా నున్న అంబేద్కర్ విగ్రహం వద్ద దివ్యాంగులు తాము ఎదుర్కోబోయే సమస్యల నేపథ్యంలో రెవెన్యూ డివిజనల్ అధికారికి మెమోరాండం సమర్పించడంలో హెచ్ఆర్సీఐ మద్దతు కోరడంతో నేషనల్ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్, జనరల్ సెక్రెటరీ నందం నరసింహారావు సూచన మేరకు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులైన కె వి వి సత్యనారాయణ ఆధ్వర్యంలో ర్యాలీ జరిపి రెవిన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
సీఎం కి నా ప్రత్యేక ధన్యవాదములు :యువనాయకుడు గుమ్మనూరు ఈశ్వర్
*సీఎం కి నా ప్రత్యేక ధన్యవాదములు :యువనాయకుడు గుమ్మనూరు ఈశ్వర్*
బి వి ఆర్ టుడే న్యూస్: (గుత్తి)
నేడు గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణం నందు ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు *డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం* అమలు చేయడం జరిగింది. ఈ సందర్బంగా గుత్తి పట్టణం ప్రభుత్వ బాలికల కళాశాల నందు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు పరచడం జరిగింది. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిధులుగా గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు *గుమ్మనూరు జయరాం* గారి తనయుడు యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్* మరియు పార్లమెంట్ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్* మరియు గుమ్మనూరు జయరాం సోదరుడు *గుమ్మనూరు నారాయణ* హాజరవ్వడం జరిగింది ఈ సందర్భంగా గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులకు కూడా కళాశాల నందు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం అనేది నిజంగా విద్యార్థుల పాలిట వరం అని ఎందుకంటే విద్యార్థులు బాగా చదవాలి అంటే అందుకు సరైన భోజనం కూడా ముఖ్యమని సరైన భోజనం తినడం ద్వారా విద్యార్థులు మరింత ఉన్నత విద్యను నేర్చుంటారని అన్నారు ఈ పథకాన్ని అమలు చేసినందుకు మన ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు కి తన ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను అని గుమ్మనూరు ఈశ్వర్ తెలిపారు.. ఈ కార్యక్రమం లో గుత్తి పట్టణ, మండల కూటమి సభ్యులు, కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు…
అయ్యా ముఖ్యమంత్రి గారూ…విద్యుత్ చార్జీల బాదుడుగా ఇదేనా సంపద అంటే…. — వైయస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
అయ్యా ముఖ్యమంత్రి గారూ…
విద్యుత్ చార్జీల బాదుడుగా ఇదేనా సంపద అంటే…. — వైయస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి.
బి.వి.ఆర్.టుడే న్యూస్, డిసెంబర్ 27 పత్తికొండ.విద్యుత్ చార్జీలు పెంపుదలతో ప్రజల నడ్డి విరిచే బాదుడుగా ఇదేనా సంపద అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అంటూ పత్తికొండ వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఎద్దేవా చేస్తూ ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుపై పత్తికొండ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో అంబేద్కర్ కూడలి వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తం చేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి నాలుగు స్తంభాల కూడలిలో నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు మాసాలలోనే విద్యుత్ చార్జీల బిల్లులు దాదాపుగా 15,400 కోట్లు పెంచి ప్రజల నడ్డి విరిగేలా పెనుభారం మోపడం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మోస పూరితమైన పాలనకు నిదర్శనంగా ప్రజలు గుర్తిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో సంపద సృష్టిస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారూ ఇదేనా సంపద అంటే అని ప్రశ్నించారు. గత కొద్దికాలం క్రితం పత్తికొండలో జరిగిన బహిరంగ సమావేశంలో మాట్లాడిన విషయాల్ని గుర్తు చేస్తూ సంపద అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను కచ్చితంగా అమలు చేయాలని చేయని పక్షంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి నాయకులుగా కూటమి ప్రభుత్వం మెడలు వంచి ప్రజాగ్రహంతో పనిచేపిస్తామని హెచ్చరించారు. తదుపరి విద్యుత్ శాఖ కార్యాలయ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గంలోని ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కన్నతండ్రి నీ కొట్టివేదిస్తున్న కొడుకు హెచ్ ఆర్ సి ఐ ని ఆశ్రయించిన తండ్రి…
కన్నతండ్రి నీ కొట్టివేదిస్తున్న కొడుకు హెచ్ ఆర్ సి ఐ ని ఆశ్రయించిన తండ్రి…
— సమస్యను పరిష్కరించిన ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్, ఉమెన్ పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ సన, మౌనిక, టీం
బి వి ఆర్ టుడే న్యూస్ మహబూబ్ నగర్:
మిడ్జిల్ గ్రామ శివారులోని (జడ్చర్ల) చౌట లక్ష్మయ్య అనే వ్యక్తి మన హ్యూమన్ రైట్స్ టీం వారిని సంప్రదించి తన కొడుకు తనకు కనీస అవసరాలు తిండిబట్ట చూడకుండా తనని కొడుతూ వేధిస్తున్నాడు అని కంప్లైంట్ చేయడం జరిగింది కావున ఆ సమస్య పైన మన హ్యూమన్ రైట్స్ టీం హైదరాబాద్ ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ సన మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఉమెన్ పోర్టు వైస్ ప్రెసిడెంట్ మౌనిక దారా వనపర్తి జిల్లా ఉమెన్ పోర్టు వైస్ ప్రెసిడెంట్ యామన్ కమల పాల్గొని మిడ్జిల్ గ్రామంలోని పెద్దమనుషుల సమక్షంలో ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది మరియు ఆ తండ్రి కొడుకులను కలపడం జరిగింది.
కన్నతండ్రి నీ కొట్టివేదిస్తున్న కొడుకు హెచ్ ఆర్ సి ఐ ని ఆశ్రయించిన తండ్రి…
కన్నతండ్రి నీ కొట్టివేదిస్తున్న కొడుకు హెచ్ ఆర్ సి ఐ ని ఆశ్రయించిన తండ్రి…
— సమస్యను పరిష్కరించిన డిస్టిక్ ఉమెన్ పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ మౌనిక, టీం
బి వి ఆర్ టుడే న్యూస్ మహబూబ్ నగర్:
మిడ్జిల్ గ్రామ శివారులోని (జడ్చర్ల) చౌట లక్ష్మయ్య అనే వ్యక్తి మన హ్యూమన్ రైట్స్ టీం వారిని సంప్రదించి తన కొడుకు తనకు కనీస అవసరాలు తిండిబట్ట చూడకుండా తనని కొడుతూ వేధిస్తున్నాడు అని కంప్లైంట్ చేయడం జరిగింది కావున ఆ సమస్య పైన మన హ్యూమన్ రైట్స్ టీం హైదరాబాద్ ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ సన మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఉమెన్ పోర్టు వైస్ ప్రెసిడెంట్ మౌనిక దారా వనపర్తి జిల్లా ఉమెన్ పోర్టు వైస్ ప్రెసిడెంట్ యామన్ కమల పాల్గొని మిడ్జిల్ గ్రామంలోని పెద్దమనుషుల సమక్షంలో ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది మరియు ఆ తండ్రి కొడుకులను కలపడం జరిగింది.