విశేష అలంకరణలో దర్శనమిచ్చిన ” శ్రీ బుగ్గ సంగమేశ్వరుడు “…- నేత్రానందకరంగా దర్శించుకున్న భక్తజనులు..- బి వి ఆర్ న్యూస్ ; నవంబర్ 04 గుంతకల్లుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన దక్షిణా కాశి గా పేరొందిన శైవ క్షేత్రం శ్రీ బుగ్గ సంగమేశ్వర స్వామి దేవస్థానం. అనంతపురం జిల్లా గుంతకల్లు కర్నూలు జిల్లా రహదారి లో గల సంఘాల గ్రామ సమీపంలో ఏపీ రాష్ట్ర పురావస్తు శాఖ వారు గుర్తించిన శిలా శాసనంపై గుర్తించిన శకవర్షములు 1441 క్రీస్తు శకం 15వ శతాబ్దం నాకు చెందిన విజయనగర సామ్రాజ్యం రాజు అయిన శ్రీకృష్ణదేవరాయల వారిచే ఆలయం నిర్మితమైనట్ల పూర్వీకుల నానుడి. పరమశివునికి ప్రీతికరమైన మాసములలో కార్తీకమాసం ఒక విశిష్టత అందులో కార్తీకమాసం సోమవారం వారిని దర్శించిన పూజించిన, అభిషేకించిన , భక్తాదులకు పుణ్యబలం లభిస్తుందన్నది ప్రతితి . కార్తీక మాసం లో కార్తీక సోమవారాలుగా నవంబర్ 4వ,11వ తేదీ ,18వ తేదీ ,25వ తేదీ ల లో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడునని ఆలయ అర్చక బృందం తెలిపారు. ఈ క్రమంలో వరమ పవిత్ర కార్తీక పౌర్ణమి 15వ తేదీ శివప్రతి దీపోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తాదుల చే సంయుక్తంగా తాము నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఇదిలా ఉండగా కార్తీక మొదటి సోమవారం పురస్కరించుకొని శ్రీ బుగ్గ సంగమేశ్వర స్వామి వారి మూలవరులకు విశేష పంచామృత అభిషేకాల బిల్వపత్రములచే వైదికంగా అర్చక బృందం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుండి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రల వివిధ ప్రాంతపు భక్తజనులు శ్రీవారిని దర్శించుకుని తమ తమ మృక్కులను తీర్చుకున్నారు. ఈ క్రమంలో ఆయా భక్తులకు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఏ కృష్ణయ్య పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది గ్రామ పెద్దలు సంయుక్తంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు