Wednesday, April 23, 2025
spot_img

పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబు సుడిగాలి పర్యటన…

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు..

సచివాలయం 3, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, మోడల్ స్కూల్ పరిశీలన
పత్తికొండ : విధుల్లో సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే కెఈ శ్యాం బాబు హెచ్చరించారు. బుధవారం పత్తికొండలో ఆయన సుడిగాలి పర్యటన చేసి సచివాలయం3, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం, మోడల్ స్కూల్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం-3 లో అటెండర్ రిజిస్టర్ను పరిశీలించారు. కార్యాలయంలో ఒక ఉద్యోగి ఉండడంతో మిగిలిన వారు ఎక్కడని ప్రశ్నించారు. ఫీల్ కు వెళ్లారని చెప్పడంతో మీ కార్యాలయంపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్ప వని హెచ్చరించారు. రైతు భరోసా కేంద్రంలో కాలం చెల్లిన యూరియా బస్తాలు చూసి ఇదేంటని సిబ్బందిని ప్రశ్నించారు. అధికారులకు తెలిసిన అక్కడ సిబ్బంది చెప్పడంతో వెంటనే అవన్నీ క్లీన్ చేసి కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచాలని మరోసారి తనిఖీకి వచ్చినప్పుడు ఇలాంటివి కనిపిస్తే చర్యలు తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు వేసిన వ్యాక్సిలను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న సమస్యల గురించి సిబ్బంది ఆయనకు తెలపడంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడినుంచి మోడల్ స్కూల్ కి వెళ్లిన ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో పనిచేయని ఆరో ప్లాంట్ పై ప్రిన్సిపాల్ ని ప్రశ్నించారు. విద్యార్థులకు మంచి నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్లాంట్లు ఎలా వృధాగా వదిలేస్తారని వెంటనే దాన్ని బాగు చేయించాలని చెప్పారు. పాఠశాలలో ఉన్న ల్యాబ్ను పరిశీలించి విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించాలని అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న పత్తికొండ ప్రాంతంలో విద్యార్థులకు చదివి ఎంతో అవసరం అన్నారు. పదవ తరగతి క్లాస్ రూమ్ లో విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నో మంచి అవకాశం విద్యార్థులు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తును అందుకోవాలని సూచించారు. ఆయనతోపాటు టిడిపి నాయకులు సాంబశివరెడ్డి తుగ్గలి నాగేంద్ర మనోహర్ చౌదరి తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular