Thursday, January 23, 2025
spot_img

తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం

తిరుపతి నవంబర్ 6

ఘనంగా తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సంబరాలు
-ముఖ్య అతిథులుగా తిరుపతి చంద్రగిరి పూతలపట్టు ఎమ్మెల్యేలు , టిటిడి బోర్డు సభ్యులు, తిరుపతి జిల్లా ఎస్పీ తో పాటు

ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, పలువురు ప్రముఖులు హాజరు

తిరుపతి ప్రెస్ క్లబ్ కి స్థలంతో పాటు జర్నలిస్టులకు ఇంటి స్థలాలకు ఎమ్మెల్యేల హామీ

ఆనందం వ్యక్తం చేసిన నూతన కమిటీ నేతలు సభ్యులు, జర్నలిస్టు సోదరులు వారి కుటుంబ సభ్యులు

ఆకట్టుకున్న కళాకారుల గేయాలు. తిరుపతి ప్రెస్ క్లబ్ సొంత భవనానికి, అలాగే జర్నలిస్టుల ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తిరుపతి , చంద్రగిరి, పూతలపట్టు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, పులివర్తి నాని, మురళీమోహన్ స్పష్టం చేశారు. తిరుపతి తుడా కచ్చపి సమావేశ మందిరంలో బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి చిత్తూరు ఎంపీ ప్రసాద్, అలాగే తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, వేదిక్ యూనివర్సిటీ విసి రాణి రాధా మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ జర్నలిస్టు సోదరులకు సొంత భవనం ఇవ్వడంతో పాటు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జర్నలిస్టు సోదరులు మాకు సహాయ సహకారాలు అందిస్తే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతిని రాకెట్ వేగంతో మరింత అభివృద్ధి చేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి నేతల గొప్పతనాన్ని నన్ను దిశల చాటి చెబుతామన్నారు. అంతేకాకుండా గంజాయి మత్తు నుండి యువతను కాపాడుతామన్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ తిరుపతి పట్టణంలో జర్నలిస్టు సోదరులకు సొంత భవనానికి, ఇంటి స్థలాలకు స్థలాలు లేకుంటే చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రూరల్ ప్రాంతంలో స్థలాలు ఇచ్చి వారికి అండగా ఉంటామన్నారు. గంజాయి అనేది చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడ లేకుండా గట్టి నిగా పెట్టడంతో పాటు గంజాయిని ఎక్కడికక్కడే అరికట్టేందుకు తగు చర్యలు పోలీసులు ద్వారా తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే పూతల పట్టు మురళితో జర్నలిస్టు సోదరుల సమస్యలపై పలు తపాలా చర్చించుకోవడం జరిగిందన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ ఒక జర్నలిస్టుగా ఎమ్మెల్యేగా జర్నలిస్టు సమస్యలను క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తెలుస్తుంది అని వారి యోగక్షేమాలను గుర్తించుకోవడంతోపాటు తిరుపతి ప్రెస్ క్లబ్ కు సొంత స్థలం అలాగే జర్నలిస్టు ల ఇంటి స్థలాలు ఇచ్చేందుకు సుముఖముగా ఉన్నామని తన వంతు పూర్తి సహాయ సహకారాలు జర్నలిస్టు సోదరులకు ఉంటాయని స్పష్టం చేశారు. అనంతరం టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు సోదరుల సమస్యలను పరిష్కరించడంలో మేము ముందున్నామని దీనిపై అవసరమైతే బిజెపి ఉన్నత అధికారులతో మాట్లాడతామని చెప్పారు. ఎంపీ ప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు వారి అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ గంజాయి అనే మాట తిరుపతి జిల్లాలో వినపడనీయకుండా చేస్తామని అయితే గంజాయి గురించి జర్నలిస్టు మిత్రులకు ఎవరికైనా తెలిసిన తమకు తెలియజేయాలే తప్ప పేపర్లో తప్పుడు కథనాలు రాస్తే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జర్నలిస్టులతో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. వారికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. అనంతరం పలువురు సీనియర్ జర్నలిస్టులు వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం కళాకారుల పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. అంతకుముందు తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శి ఆర్ మురళి, బాలు మాట్లాడుతూ తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై విజయవంతం చేసిన జర్నలిస్టు సోదరులు వారి కుటుంబ సభ్యులకు పార్టీలకు హాజరైన పలువురు ప్రముఖులకు పెద్దలకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సోదరులు నూతన కమిటీ నేతలు సభ్యులు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ నేతలు సభ్యులను పలువురు సెల్వ పుష్ప గుచ్చాలతో సత్కరించి అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular