
గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో…
డిసిహెచ్ఎస్ చర్యలు అమలు…
-ప్రత్యేక సిబ్బంది నియామకం .
-మార్పులు చేర్పులు నోటరీ సర్టిఫికెట్ తో చేసుకోవచ్చు..
గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి జనన మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరు జారీలో జరుగుతున్న జాప్యంపై డిసిహెచ్ఎస్ అధికారి డాక్టర్ పాల్ రవికుమార్ చర్యలు చేపట్టారు. గురువారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో జనన మరణ ధ్రువీకరణ పత్రాలు ఆన్ లైన్ నమోదు ప్రక్రియలో సిబ్బంది ఆలక్ష్యంపై డిసిహెచ్ఎస్ తనదైన శైలిలో కొరడా ఝులిపించిన వైనం. ఇటీవల ఆయన ఆకస్మికంగా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో జరుగుతున్న వైద్య సిబ్బంది చేపడుతున్న రోగుల పట్ల సేవలు, జనన మరణ ధ్రువీకరణ పత్రాల ఆన్లైన్ నమోదు లో జరుగుతున్న జాప్యంపై పలు ఫిర్యాదులుగా తనకు అందిన సమాచారంతో ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. తన పర్యటనలో భాగంగా చేపట్టిన తనిఖీలలో వైద్య ఆరోగ్య సిబ్బంది కొరత, ఆన్లైన్ వెబ్సైట్ లో జరుగుతున్న అనివార్య సంఘటనలను గుర్తించారు. ఈ క్రమంలో జనన మరణ ధ్రువీకరణ ఆన్లైన్ నమోదులో సిబ్బంది చేస్తున్న జాప్యం పనితీరుపై అసంతృప్తి వ్యక్తంతో చర్యలకు ఉపక్రమించినట్లు స్థానిక ఆసుపత్రి ఏవో రాంప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఆన్లైన్ నమోదులో భాగంగా ఆసుపత్రిలో పలువురు సిబ్బంది వివిధ శాఖలలో సమయపాలన వర్తింపు దిశగా ఓ ఐదు మంది సిబ్బంది నియామకం ద్వారా ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. సదరు సిబ్బందిచే ప్రజలకు జనన మరణ ధ్రువీకరణ ఆన్లైన్ నమోదు తో సర్టిఫికెట్ల మంజూరు చేస్తూ లబ్ధిదారులకు సులభతరంగా అందజేయుటకు చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆడియో మెట్రీషియన్ విధులు నిర్వహిస్తున్న గణేష్ రెడ్డి, ఫిజియోథెరపిస్ట్ రమేష్, శానిటేషన్ సూపర్వైజర్ పరుశురాముడు, డెంటల్ హైజనిస్ట్ శివకుమార్ హెల్త్ కౌన్సిలర్ ఆశ తదితర సిబ్బంది నియామకంతో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జనన మరణ ధ్రువీకరణ పత్రాలలో భాగంగా లబ్ధిదారుల ఇంటి పేరు తదితర పలు అంశాల మార్పులు చేర్పులు అనివార్యంగా ఆదేశాలున్నాయి. సదరు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నమోదు చేస్తున్న సదరు సిబ్బంది లబ్ధిదారులను తమ ఆసుపత్రి వద్దకు పంపుతున్న వైనం ఉంది. ఆ వైనంలో భాగంగా 2016 మే మాసం కు ముందు ఆన్లైన్ సౌకర్యం లేమి కారణంగా ఆన్లైన్ నమోదులో నోటరీ సర్టిఫికెట్ తో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందన్న సత్యాన్ని సదరు అధికారులు గుర్తించాలన్నారు. ఈ విషయంలో ప్రజలను తమ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలుగా చేపడుతున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనలు మేరకు నోటరీ సర్టిఫికెట్ ఆమోదంతో మార్పులు చేర్పులకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.