
గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మంచినీటి సౌకర్యం కల్పన…
- ఆర్వో ప్లాంట్ మరమ్మతులకు చర్యలు…
గత కొన్నేళ్లుగా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వైద్య ఆరోగ్య సిబ్బందికి త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం డిసిహెచ్ఎస్ డాక్టర్ పాల్ రవికుమార్ గుంతకల్లు పర్యటనలో భాగంగా ఆసుపత్రి తనిఖీలు ప్రధానంగా త్రాగునీటి సమస్యను గుర్తించారు. సదరు సమస్య పై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి ఆకుపత్రిలో వివిధ సమస్యలపై వివరాలను ఆయన అందించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిసిహెచ్ఎస్ ఉత్తర్వులతో గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలిట వరంగా దాదాపు లక్ష రూపాయల మేర వేయంతో ఆర్వో ప్లాంట్ నిర్వహణకు మరమ్మతుల చర్యలకు గురువారం స్థానిక ఏవో రాంప్రసాద్, వైద్యాధికారి డాక్టర్ అజేంద్ర రావు శ్రీకారం చుట్టారు.