
ఈనెల 11న గుత్తి గేట్స్ కళాశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు…
ప్రతి ఒక్కరిలో కంటిచూపు ఎంతో ప్రాధాన్యం. ఈనెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు గుత్తి పట్టణంలో గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల లో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కళాశాల యాజమాన్యం గురువారం ఓ ప్రకటనలో ఓ ప్రకటనలో తెలిపారు. యాజమాన్యం తెలిపిన వివరాల మేరకు గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకుడు దివంగత శ్రీ వి కే సుధీర్ రెడ్డి గారి 7 వ వర్ధంతిని పురస్కరించుకొని సక్ష్యమ్ అనే స్వచ్ఛంద సంస్థ తోడ్పాటుతో కంటి వైద్య నిపుణులచే కంటి పరీక్షల నిర్వహణతో అవసరమైన కంటి ఆపరేషన్ చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. సదరు వైద్య శిబిరంకు ఉదయం 9 గంటలకు తమ కళాశాలకు వైద్య పరీక్షల నిమిత్తం బాధితులు చేరుకోవాలని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.