
అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి
ఏక్ పెడ్ మా కి నామ్ యువతకు పిలుపు
రామ్ అకాడమీ కాలేజ్ కరస్పాండెంట్ ఎం మధుసూదన్ …
తిరుపతి ఎంఆర్ పల్లి లోని న్యూ బాలాజీ కాలనీ రామ్ అకాడమీ కాలేజ్ నందు కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ సారధ్యంలోని నెహ్రూ యువ కేంద్ర సహకారంతో పరివర్తన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంయుక్తంగా జిల్లా యూత్ ఆఫీసర్ ప్రదీప్ డిస్టిక్ అకౌంట్స్ ఆఫీసర్ బాబు రెడ్డి సూచనల మేరకు ” ఏక్ పెడ్ మా కి నామ్ “( అమ్మ పేరుతో ఒక చెట్టు నాటండి ) అనే అవగాహన సమావేశం కళాశాల విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించడం జరిగిందని పరివర్తన స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ , తిరుపతి అర్బన్ మండలం బయోడైవర్సిటీ కమిటీ కోఆర్డినేటర్ పి అమర్నాథ్ తెలియజేసినారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రామ్ అకాడమీ కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ సాయి కళా ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ ఎం. మధుసూదన్ విచ్చేసి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థులు యుక్త వయసు నుండే సమాజం పట్ల అవగాహన పెంచుకొని తమ బాధ్యతగా భావించి పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ కాలుష్య నివారణకు, పచ్చదనం పరిశుభ్రత పెంచుటకు, ప్లాస్టిక్ మహమ్మారి నిర్మూలనకు నిరంతరం మరియు మొక్కలు నాటడం కోసం తమ చుట్టూ యువతను ఉన్న వారిని చైతన్యవంతులను చేయాలని అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి అనే కార్యక్రమంలో పాల్గొని మొక్కల నాటాలని ఆయన సలహా ఇచ్చారు. అలాగే మరో పర్యావరణ వేత్త మార్గదర్శి అభ్యుదయ సేవా సమితి కార్యదర్శి ఎన్ దొర స్వామి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతీ యువకులలో భూ సంరక్షణ, పర్యావరణ సంరక్షణ, ప్లాస్టిక్ నిర్మూలన మరియు రీసైకిలింగ్ గురించి అనేక రూపాలలో ప్రచార కార్యక్రమాలు చేపట్టడుతున్నారు, దీనిలో భాగంగా అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి అనే నినాదంతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శ్రీ భారతి సోషల్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి ఎస్ ఎన్ రాజా, కెమిస్ట్రీ లెక్చరర్ అర్ వి ప్రభాకర్ రాజు తిరుపతి మండలం ఫారెస్ట్, బయోడైవర్సిటీ కమిటీ మెంబర్లు జీ శ్రీనివాసులు, ఏం వెంకటేష్, ఎం రమేష్ మరియు యువతీ యువకులు పాల్గొన్నారు.