
ఏపీలో దేవాదాయ శాఖలో త్వరలో 500 పోస్టుల భర్తీ: మంత్రి ఆనం
అమరావతి :
ఏపీలో దేవాదయశాఖలోని పలు క్యాడర్లలో 500 పోస్టుల భర్తీ చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు త్వరలోనే దేవాలయ ట్రస్టు బోర్డుల నియామక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. అన్నిరకాల ప్రసాదాల తయారీలో ఏ-గ్రేడ్ సామగ్రినే వాడాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల్లో వ్యాపార ధోరణి కాకుండా ఆధ్యాత్మిక చింతన ఉండాలని సూచించారు. నిత్యం ఓంకారం, దేవతా మూర్తుల మంత్రోచ్చారణవినిపించాలని పేర్కొన్నారు.