

అపార్ (APAAR) కోసం స్కూల్ రికార్డ్స్ కరెక్షన్ అధికారాలు బదలాయింపు చేస్తూ ఉత్తర్వులు….
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల రికార్డులలో అవసరమైన దిద్దుబాటు కోసం మార్చి 2025 వరకు తాజా అధికారాల బదలాయింపు కొనసాగింపు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా పరిధిలోని MEOలు / ప్రధానోపాధ్యాయులు GrII / DYEO లకు అధికారాల డెలిగేషన్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. సదరు ప్రభుత్వ ఉత్తర్వులలో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక ,ప్రాథమికోన్నత పాఠశాలల వరకు MEO లకు అధికారాలు ఇచ్చారు. అలాగే ZP , GOVT, MPL ఉన్నత పాఠశాలలకు గ్రేడు టు హెడ్ మాస్టర్లకు అధికారాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రైవేటు ఉన్నత పాఠశాలలకు డివై ఈవో లకు అధికారం ఇచ్చారు. సదరు ఉత్తర్వులు మార్చి 2025 వరకు తాజా అధికారాల బదలాయింపు కొనసాగుతుందని ఉత్తరంలో పేర్కొన్నారు.