Wednesday, April 23, 2025
spot_img

రేషన్ బియ్యం, ఓ బొలెరో వాహనం సీజ్.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు.

80 ప్యాకెట్ల బియ్యం తోపాటు బొలెరో వాహనం సీజ్…..

-ఇద్దరు వ్యక్తుల అరెస్టు..

గుంతకల్లులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
నిరుపేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం ను పలువురు అక్రమంగా ఇతర ప్రాంతాలకుతరలిస్తున్న వైనం లో అధికారుల అలసత్వం బహిర్గతంగా కావడం హేయం. గురువారం అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో గుంటకల్ పట్టణంలోని టీవీ స్టేషన్ దగ్గర కూడలి వద్ద టూ టౌన్ పోలీసు వారు వాహనాలు తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో బొలెరో వాహనంలో దాదాపు 3600 కేజీలు గల 80 బస్తాలు రేషన్ బియ్యం గుత్తి వైపు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనంలో ప్రయాణిస్తున్న గుత్తి ప్రాంతానికి చెందిన నాగ శేషు , హరి ప్రసాద్ లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. సదరు సంఘటనపై రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి పట్టుబడిన బియ్యం ను అప్పగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular