
శ్రీ నెట్టికంటుని సన్నిధిలో కార్తీక మాసోత్సవ ప్రత్యేక పూజలు…
నవంబర్ 09 గుంతకల్లు.
గుంతకల్లు కార్తీకమాసంను పురస్కరించుకుని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో భక్తులు విశేషంగా కార్తీక మాసోత్సవ దీపాలతో ప్రత్యేక పూజా కార్యక్రమ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శ్రీవారికి అత్యంత ప్రియమైన శనివారం అందులో కార్తీక మాసంను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుండి భక్తాదులు విరివిగా పాల్గొని శ్రీవారిని దర్శించుకుని తమ తమ మ్రొక్కులను తీర్చుకున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారుల పర్యవేక్షణలో భక్తులకు సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చొరవ చూపారు. ఇదిలా ఉండగా దేవాలయంకు చేరుకున్న భక్తాదులకు ప్రధానంగా జేబులకు చిల్లులుగా ఆలయ అధికారులు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. శ్రీవారి దర్శనం కేవలం ధనార్జనే లక్ష్యంగా ఆలయ అధికారుల తీరుండడం, ఆలయ ప్రాంగణంలో ప్రతి చోట దోపిడీ విధానంగా పైసావసూల్ అన్న తీరుకు ప్రాధాన్యతగా ఉందని భక్తాదులు ఆరోపణలు చేస్తుండడం గమనార్హం.