విశేష పూజలు అందుకున్న శ్రీ బుగ్గ సంగమేశ్వరుడు…
-అర్ధనారీశ్వర అలంకారంలో పార్వతీదేవి….
— కార్తీక దీపోత్సవ వేడుకలతో మ్రొక్కులు తీర్చుకున్న భక్తాదులు…
నవంబర్ 11, గుంతకల్లు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా దక్షిణ కాశీగా పిలవబడుతున్న శ్రీ బుగ్గ సంగమేశ్వరుని ఆలయంలో కార్తీకమాస ఉత్సవ అభిషేకాలతో విశేష అలంకరణలతో శ్రీవార్లకు ప్రత్యేక పూజలతో భక్తులు మ్రొక్కులను తీర్చుకున్నారు. కార్తీక మాసం రెండవ సోమవారంను పురస్కరించుకొని దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి ఏ. కృష్ణయ్య పర్యవేక్షణలో ఆలయ అర్చకులు బృందం సంయుక్తంగా శ్రీవారి మూలవర్లకు పంచామృత రుద్ర అభిషేకములు, బిల్వపత్రములు వివిధ పుష్పముల అలంకరణతో పాటు తమలపాకులు తదితర పూజా సామాగ్రితో విశేష పూజలను చేపట్టారు. యధావిధిగా శ్రీవార్ల ఉత్సవమూర్తులను పలువురు గ్రామ పెద్దలు ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. ఇదిలా ఉండగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తజనులు శ్రీ వార్లను నేత్రానందంగా దర్శించుకున్నారు. అలాగే భక్తాదులు ఆలయ ప్రాంగణంలోని అశ్వర్థవృక్షం వద్ద తమ తమ మొక్కుబడులుగా కార్తీక దీపోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకోవడం విశేషం. కాగా ఈ ఏడాది విశేషంగా శ్రీ పార్వతీదేవి అమ్మవారు మూల మూలవర్లకు అర్చక బృందం ప్రత్యేకంగా అర్ధనారీశ్వర అలంకరణ గావించి భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తాదులు శ్రీవార్లను భక్తిపారవశ్యంతో దర్శించుకుని తమ తమ మ్రొక్కులను తీర్చుకున్నారు. తదుపరి ఆలయ పరిసరంలో ఏర్పాటుచేసిన నిత్యాన్నదాన కేంద్రంలో భక్తాదులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
నేత్రానందకరంగా శ్రీ బుగ్గ సంగమేశ్వర స్వామి వారు…
RELATED ARTICLES