
శ్రీ నెట్టికంటుని సన్నిధిలో వైదికంగా తిరుమంజన స్నపనము.. మన్యుసూక్త హోమం…
నవంబర్ 11, గుంతకల్లు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీవారి జన్మ నక్షత్రంను పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. సోమవారం పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ అధికారుల పర్యవేక్షణలో వేద పండితులు, అర్చక బృందం సంయుక్తంగా యాగశాలలో శ్రీవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక వేదికపై ఉపస్తించి తిరుమంజన స్నపనము (అభిషేకం) గావించి ప్రత్యేక పూజలతో పాటు మన్యుసూక్త హోమంను వైదికంగా నిర్వహించారు.