
శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష పూజలు…
నవంబర్ :11 గుంతకల్లు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం పరిధిలోని
ఉపాలయం శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. కార్తీకమాసం సోమవారం పురస్కరించుకొని శ్రీవార్ల మూలవర్లకు ఆలయ అధికారులు పర్యవేక్షణలో అర్చక బృందం మహన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం, పూజలు వైదికంగా నిర్వహించారు.