
గేట్స్ కళాశాలలో మెగా కంటి వైద్య శిబిరం…
నవంబర్ 11: గుత్తి
గేట్స్ కళాశాల అధినేత వికే సుధీర్ రెడ్డి ఏడవ వర్ధంతి పురస్కరించుకొని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల, సక్షo స్వచ్ఛంద సంస్థ వారు సోమవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వైద్య శిబిరానికి హాజరైన 300 మంది కి కడప పుష్పగిరికి చెందిన కంటి వైద్య నిపుణులు వైద్య పరీక్షలు నిర్వహించారు వీటిలో వందమంది కంటి శస్త్ర చికిత్సల కోసం ఎంపిక చేశారు. ఎంపికైన వారిని పుష్పగిరి వైద్యశాలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు అవసరమైన వారికి కంటి అద్దాలు సూచించారు. కళాశాల డైరెక్టర్ శ్రీ వాణి మాట్లాడుతూ కంటే వైద్య శిబిరానికి విశేష స్పందన రావడం కేవలం గేట్స్ సంస్థ మీద ఉన్న నమ్మకంఅన్నారు. అలాగే వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు కళాశాల యాజమాన్యం వారు శిబిరానికి హాజరై వారికి భోజన సౌకర్యాలు కల్పించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వీకే పద్మావతి, ఎండి రఘునాథ్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ ,సక్షo జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, గేట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ,అధ్యాపకులు పాల్గొన్నారు