
అనంత జనసేనానికి అహుడ చైర్మన్ పదవి ఇవ్వడం హర్షనీయం.
గుంతకల్లు జనసేనాని వాసగిరి మణికంఠ
నవంబర్ 12 : గుత్తి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన శుభపరిణామంగా కార్యకర్తలకు పెద్దపీట వేస్తుండటం అభినందనీయం. ఈ క్రమంలో నూతనంగా అనంతపురం – హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడ) చైర్మన్ పదవిని అనంత జనసేనాని టి సి వరుణ్ కు కేటాయించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం తాము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామంటూ గుంతకల్లు నియోజకవర్గం జనసేనాని వాసగిరి మణికంఠ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుత్తి పట్టణం ఆర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తమ నేతలు జిల్లాలోని ఆయా పార్టీల శ్రేణుల పట్ల తమ వంతు బాధ్యతగా పదవులను ఇవ్వడం వారిలో రాజకీయ చైతన్యం తో కూడిన ప్రజాసేవకు సహకరించాలని పిలుపునివ్వడం హర్షనీయమని ఉద్ఘాటించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు గుత్తి బాట సుంకులమ్మ ఆలయం నుండి పట్టణ మీదుగా అనంతపురం నగరం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని కూటమి కుటుంబ సభ్యులందరూ విరివిగా పాల్గొని సదరు కార్యక్రమంలో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుత్తి మండల , పట్టణ అధ్యక్షులు పోతరాజుల వెంకటేశ్వర్లు, పాటిల్ సురేష్ లతోపాటు జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్ గుత్తి సీనియర్ నాయకులు నాగయ్య రాయల్, అశ్వ నాగప్ప, అఖండు భాష, ధను, ఓబులేసు, హసన్, రమేష్ గుంతకల్లు శ్రేణులు కసాపురం నందా ,గాజుల రాఘవేంద్ర, సుబ్బయ్య ,అమర్, సుంకర నాగరాజు, లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.