
ప్రాణదాత సేవా సమితి కి భారత సేవా రత్న అవార్డు లభించింది.
నవంబర్ 14 :రాయచోటి.
అన్నమయ్య జిల్లా. రాయచోటి లోని మదనపల్లి రోడ్డు లో ఉన్న PCR ఫంక్షన్ హాల్ జరిగిన జాతీయ అవార్డుల్లో భాగంగా ప్రాణదాత సేవా సమితి గుంతకల్లు వారు చేస్తున్న సేవలను గుర్తించి భారత సేవా రత్నా పురస్కారని సోమల రాజు ఫౌండేషన్ వారు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమరాజు ఫౌండేషన్ శివరాజు మాట్లాడుతూ ప్రాణదాత సేవా సమితి రక్తదాన సేవా కార్యక్రమాలు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఇబ్బంది పడే వారికి సరైన సమయానికి బ్లడ్ అరెంజ్ చేయడం. మూగజీవాలకు పండ్లు ఇవ్వడం. రక్తదానంపై అవగాహన అనేక సేవా కార్యక్రమం చేస్తున్నందుకు భారత సేవా రత్న అవార్డు ఇవ్వడం జరిగింది అన్నారు.
ఈ అవార్డు మా ప్రాణదాత సేవా సమితి రక్తదాతలకు అంకితం.ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.