Wednesday, July 30, 2025
spot_img

ఉపాధి హామీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.

ఉపాధి హామీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి.

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
అనంతపురం, నవంబర్ 14:

జిల్లాలో ఉపాధి హామీ కింద కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు.
గురువారం సాయంత్రం అనంతపురం కలెక్టర్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అమలవుతున్న పథకాలపై డ్వామా పిడి, ఎంపిడిఓలు, ఎపిడిలు, ఎపిఎంలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..        జల్ సంచయ్ – జన్ భగీ దారి  ఫోటో అప్లోడ్ త్వరితగతిన  పూర్తిచేయాలని  అన్నారు.జల్ సంచయ్ – జన్ భగీ దారి కార్యక్రమం   నందు గుంతకల్లు మండలం చాలా వెనుకబడి ఉందని  పురోగతి సాధించాలని  చెప్పారు. తదుపరి జరగబోయే  మీటింగ్ నందు నోడల్ అధికారులు తప్పక హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. నిర్దేశించిన సమయానికి ప్లాంటేషన్ వర్క్ 100% పూర్తి చేయాలని, పల్లె వనాలు  పథకానికి  సంబంధించి త్వరితగతిన   అనుమతులు పొంది  పనులను చేపట్టాలని,  అనుమతులు పొందిన రాయదుర్గం వారు సోమవారం పనులు ప్రారంభించాలని ఆదేశించారు.ఫారం పాంట్స్  ప్రతివారం  జిల్లా మొత్తం 300 మొదలుపెట్టాలని  అందులో  రాప్తాడు నందు చాలా తక్కువగా ఉన్నదని గుర్తించామన్నారు.  మండలాలలో పనులను గుర్తించి మండల రెజల్యూషన్  పూర్తి చేసి  మండలంలో  కనీసం 10  పనులను ప్రారంభించే విధంగా చూడాలని అన్నారు.అలా చేస్తేనే వందరోజుల ప్రణాళికలను  పూర్తి చేయడానికి వీలవుతుందని  తెలిపారు.  రూప్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ ఏడు రోజుల లోపల అనుమతులు తీసుకొని  పనులను వేగవంతం చేయాలని  అన్నారు.కమ్యూనిటీ సోప్ పిట్స్ 286 శాంక్షన్ అయ్యాయని దీనిలో కుందుర్పి మండలం నందు చాలా పెండింగ్ ఉన్నాయని జిల్లాలో వారానికి కనీసం 50 పనులు ప్రారంభిస్తే లక్ష్యాలను చేరుకునే ప్రణాళికలను తయారు చేసుకుని ముందుకు వెళ్లే విధంగా చూడాలన్నారు. ఈ పనుల నందు ఆలస్యం వహిస్తే కఠిన చర్యలు పేర్కొన్నారు. ఇండివిడ్యువల్ కమ్యూనిటీ సోప్ పిట్స్ సింగనమల వెనుకబడి ఉందని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈనెల 18 తరువాత అనుమతులు మంజూరు ప్రారంభిస్తే రోజుకు 2500 పూర్తి చేయు విధంగా చేస్తేనే ప్రభుత్వం చెప్పినట్లు నవంబర్ చివరి నాటికి లక్ష్యాలను చేరుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో డ్రామా పీడీ, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఏపీఎంలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular