
అపార్ ఐడి కార్డ్స్ పై కలెక్టర్ సమీక్ష ..
నవంబర్ 14: అనంతపురం
జిల్లాలోని డిపిఓ ,మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లు,DLDO లు మండల విద్యాశాఖ అధికారుల తో అపార్ ఐడి కార్డ్స్ జనరేషన్ పైన గౌరవ జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది
ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థి యొక్క ఇబ్బందులను కేస్ వైస్ తయారు చేసుకుని వాటి పరిష్కారం కొరకు జిల్లా కార్యాలయానికి పంపవలెనని ఆదేశించారు. ప్రతి మండల విద్యా కేంద్రం మరియు ఉన్నత పాఠశాలలు ఈ ప్రక్రియ పూర్తి చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్లను అందుబాటులో ఉంచవలసినదిగా మున్సిపల్ కమిషనర్లను ఎంపీడీవోలను ఆదేశించడం జరిగినది గతంలో ఆదేశించినట్లుగా ప్రతి ఉన్నత పాఠశాలలో మూడు టీములను ఏర్పాటు చేశారా లేదా అనే విషయం పైన రాయదుర్గం మండల విద్యాశాఖ అధికారిని ప్రశ్నించడం జరిగినది, దీని ద్వారా జిల్లా అంతట ప్రతి ఉన్నత పాఠశాలలో మూడు టీములను ఏర్పాటు చేసినట్లుగా గుర్తించడమైనది అపార్ ఐడిని జనరేట్ చేసే క్రమంలో సర్వర్ సమస్యలల్ గురించి ప్రస్తావించి వాటి విషయమై గుత్తి మండల విద్యాశాఖ అధికారులు సమీక్షల్ చేయడం జరిగింది, ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులచే అపార్ ఐడి కార్డు విషయమై సమావేశమును ఏర్పాటు చేసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నం చేయవలసినదిగా గతంలో ఆదేశించిన విషయమై సమీక్ష చేయడం జరిగినది, ఉరవకొండ మండల విద్యాశాఖ అధికారిని ఈ విషయమై ప్రశ్నించగా ఆ అధికారి తల్లిదండ్రుల సమావేశంలో తల్లిదండ్రులు ప్రస్తావించినటువంటి సమస్యలను తెలియజేయడమైనది
లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ను పొందుటకు నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ను వీలైనంత త్వరగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవలసినదిగా డిపిఓ ను ఆదేశించారు.గతంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ కు సంబంధించిన ఉప విద్యాశాఖ అధికారి దగ్గర భద్రపరిచిన ల్యాప్టాప్ లను ఈ అపార్ ఐడి జనరేషన్ ప్రక్రియలో ఉపయోగించుకొనుటకు వాటిని ఒకసారి తనిఖీ చేయవలసిందిగా ఆదేశించారు . ఆధార్ సెంటర్లలో తల్లిదండ్రులు గందరగోళానికి గురి కాకుండా ఈ ప్రక్రియ మొత్తం అర్థమయ్యే విధంగా వెంటనే పోస్టర్లను తయారు చేసి పంపిణీ చేయవలసినదిగా రమణారెడ్డి ని ఆదేశించారు .జిల్లాలోని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్ మరియు ఇంటర్మీడియట్ విద్య ఉన్నతాధికారులతో వాట్స్అప్ గ్రూప్ ను క్రియేట్ చేయమని సూచించారు. ప్రతి మండలంలో ఉన్న పాఠశాలలన్నీ కూడా సమంగా MEO I & MEO II లు అనునిత్యం సందర్శించి ఈ ప్రక్రియను వేగవంతం చేయవలసినదిగా ఆదేశించారు.
.ఆధార్ కార్డు నందు ఉన్నటువంటి సవరణలకు సంబంధించి గుంతకల్ డి ఎల్ డి వో , అనంతపురం డి ఎల్ డి ఓ లతో వివరణ తీసుకున్నారు.
జిల్లాలోని ఆధార్ సెంటర్లలో ఉన్నటువంటి సమస్యల గురించి మండల విద్యాశాఖ అధికారు లు నార్పల D.HIREHAL మరియు ఆత్మకూర్ వారితో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు , జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆధార్ సెంటర్ల వివరములు మరియు వాటిలో ఉన్న సమస్యల గురించి DPO మరియు ఆధార్ నోడల్ ఆఫీసర్లను ఒక చెక్లిస్ట్ ను ప్రజెంట్ చేయవలసిందన్నారు. ఈ జూమ్ మీటింగ్ నందు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు గారు, APC నాగరాజు , DVEO వెంకటరమణ నాయక్ , APO నాగరాజు , ఆధార్ నోడల్ ఆఫీసర్ నారపరెడ్డి , బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులు తదితరులు పాల్గొనడం జరిగినది.