
శాశ్వత నిత్య అన్నదానంకు లక్ష రూపాయలు ఓ దాత దాతృత్వం…
నవంబర్ 15 :గుంతకల్లు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానం నకు దాత శాశ్వత నిత్య అన్నదానమునకు లక్ష రూపాయలు విరాళంగా తన దాతృత్వంను చాటుకున్నారు.
శుక్రవారం దేవస్థానం కార్యాలయంలో తాడిపత్రి మండలం కొండేపల్లి గ్రామానికి చెందిన జి శ్రీనివాసరావు అనే ఓ ధాత తన దాతృత్వంగా శాశ్వత నిత్యాన్న దానము నకు గాను లక్ష రూపాయలను ఆలయ సిబ్బందికి నగదును అందజేశారు. ఇదిలా ఉండగా దేవస్థానం కార్యాలయంలో ప్రధాన ముఖ్య అధికారులు గైర్హాజరుతో తాము సిబ్బందికి లక్ష రూపాయల నగదును అందించి తగు రసీదును పొందిన వైనంగా స్థానికంగా ప్రచారం ఉండడం గమనార్హం.