
శ్రీ నెట్టికంటుని సన్నిధిలో జ్వాల తోరణం ఉత్సవం…
-ఉత్సవం నిర్వహణలో అధికారుల తీరులో అలసత్వమా.. లేక నిర్లక్ష్యమా….?
నవంబర్ 15 :గుంతకల్లు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ సీతారామ చంద్ర స్వామి వారికి”జ్వాలా తోరణం ఉత్సవం” కార్యక్రమం జరిగింది. సదర్ కార్యక్రమంలో భాగంగా ఆలయ అధికారులు, ఆలయ అనువంశిక ధర్మకర్త, ఆలయ అర్చక బృందం ల సమన్వయంతో జరిగిన జ్వాల తోరణ మహోత్సవం పలు ప్రమాద సంఘటనలకు తావిస్తున్న తీరు ఉండడం గమనార్హం. జ్వాలా తోరణ ఉత్సవంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కే సుగుణమ్మ, ఆలయ ప్రధాన అర్చకుడు గరుడాచార్యులు కార్యక్రమంను ప్రారంభించారు. సదరు కార్యక్రమంలో జ్వాలా తోరణం ను వెలిగించి తదుపరి శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వారి ఉత్సవ విగ్రహాల ను ఓ పల్లకిపై ఉపస్తించి ఆలయ ప్రాకారోత్సవం ప్రారంభించారు. ఈ క్రమంలో జ్వాలాతోరణం క్రింది భాగం నుండి ప్రాకారం గా భక్తాదులతో పాటు వేద పాఠశాల చిన్నారులు, ఆలయ అధికారులు, అర్చక బృందం తదితరులు తరలి వస్తున్న నేపథ్యంలో ఓ జ్వాలతో కూడిన తోరణం క్రింద పడిన సంఘటన చోటుచేసుకుంది. కాగా ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడం శ్రీవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉందనడానికి తార్కానంగా పేర్కొనవచ్చు. సదరు కార్యక్రమం నిర్వహణలో ప్రమాద రహితంగా బాధ్యతల విస్మరింపు తీరుగా దేవస్థానం అధికారులు తమ తమ విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తీరుందని స్థానికంగా భక్తాదులు విమర్శించడం విశేషం. అలాగే ఇటీవల గత కొంతకాలంగా దేవస్థానం ప్రధాన అధికారులు గైర్హాజరు తీరులో కార్యక్రమాల నిర్వహణ జరుగుతుండడం శోచనీయం. సదరు విశేష కరమైన కార్యక్రమాలలో ఏదేని ప్రమాదములు చోటు చేసుకుంటే బాధ్యులుగా ఎవరు అని స్థానికంగా భక్తులు ప్రశ్నిస్తున్నారు.