
అపార్ జనరేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
— జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్…
నవంబర్ 16 : అనంతపురం
అపార్ జనరేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. శనివారం సాయంత్రం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అపార్ జనరేషన్ ప్రక్రియపై డిఈఓ, డివిఈవో, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్షనిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిరోజు 10 వేల నుంచి 15 వేల వరకు అపార్ జనరేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అపార్ జనరేషన్ లో అన్ని జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో వేగంగా ప్రక్రియ జరిగేందుకు ప్రిన్సిపాల్, హెడ్మాస్టర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. అపార్ జనరేషన్ లో లేట్ బర్త్ సర్టిఫికెట్ సమస్యకు సంబంధించి నెలకొన్న సందేహాలపై డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని డిఎల్డిఓలకు సూచించారు. వచ్చే మంగళవారం అనంతపురం డివిజన్ పరిధిలో, బుధవారం కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలో, గురువారం గుంతకల్లు డివిజన్ పరిధిలో డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అపార్ జనరేషన్ లో స్పష్టత, ఖచ్చితత్వం ముఖ్యమైనదన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఆధార్ అప్లోడ్ చేసి అపార్ అప్డేట్ చేయాలని, ఈ విషయమైప్రత్యేక దృష్టిసారించాలనిఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఈఓ ప్రసాద్ బాబు, డిపిఓ నాగరాజునాయుడు, డివిఈఓ వెంకటరమణ నాయక్, ఆధార్ నోడల్ అధికారి నారపరెడ్డి, ఏపీఎం నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.