
వ్యాపారులారా ..
ట్రాఫిక్ సమస్య నివారణకై సహకరించండి…
వన్ టౌన్ సీఐ మనోహర్.
నవంబర్ 17 :గుంతకల్లు
పట్టణంలో వివిధ వ్యాపారాల యాజమాన్యులు ట్రాఫిక్ సమస్య నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని వన్ టౌన్ సీఐ మనోహర్ పిలుపునిచ్చారు. ఆదివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వివిధ హోల్సేల్ ,రిటైల్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలపై వారితో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జగదీష్ ఉత్తర్వులతో స్థానిక డిఎస్పి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పట్టణంలో ప్రధాన రహదారులలో మీ గా వంతుగా ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రభుత్వ చట్టపరమైన విధి విధానాలను పాటిస్తూ సహకరించాలని ఆదేశించారు . పట్టణంలో పలు వ్యాపారాలతో ఆయా సరుకుల రవాణాలో భాగంగా వివిధ వాహనాల లోడింగ్ ,అన్లోడింగ్ విషయంలో భాగంగా రాత్రి సమయాల్లోనే ఆయా విధులు చేపట్టాలన్నారు. పగటిపూట ప్రజలకు ట్రాఫిక్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు, ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత మీపై కూడా ఉందని సూచించారు. వ్యాపారాలుగా ఆదాయం ఒక్కటే అనుకోకుండా ఆమోదయోగంగా ట్రాఫిక్ నిబంధనలను పాటింపు కు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. ఆయా దుకాణాల ముందు రోడ్డు కనపడేలా సీసీ కెమెరాలను అమర్చుకుని చోరీలు, వివిధ అసాంఘిక చర్యల నివారణకు తమ పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు..












