
జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన భాష్యం స్కూల్ విద్యార్థి తలపాటి రాజేష్
నవంబర్ 20: గుంతకల్లు
అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణానికి చెందిన,భాష్యం స్కూల్లో పదవ తరగతి చదువుతున్న, టి సురేష్,టి శిరీష దంపతుల కుమారుడైన తలపాటి రాజేష్,ఈ నెల 26వ తేదీన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరగనున్న జాతీయ స్థాయి ఆర్థటిక్స్ పోటీలకు గోరింట100 రిలే లో ఎంపికయ్యాడు, విద్యార్థి తలపాటి రాజేష్ చిన్నప్పుడు నుంచి, క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచేవాడు, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి,అన్నింటిలోనూ ఉత్తమ ప్రతిభ కనపరిచి ఇప్పుడు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల స్కూల్ యాజమాన్యం వారు, విద్యార్థిని అభినందిస్తున్నారు. ముఖ్యంగా తలపాటి రాజేష్, కె పద్మనాభ రెడ్డి,వి నారాయణరావు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు, జాతీయస్థాయికి పోటీలకు, తలపాటి రాజేష్,ఎంపిక కావడం పట్ల జిల్లా స్థాయి నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి, అలాగే జాతీయస్థాయిలో ఈనెల 26న జరుగుతున్న పోటీలలో, తలపాటి రాజేష్ ఉత్తమ ప్రతిభ కనబరిచి, మొదటి స్థానం విజేతగా నిలవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు.