
భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు శిక్షతోపాటు రూ.15 వేలు జరిమానా…
నవంబర్ 20 గుంతకల్లు
అనంతపూర్ జిల్లా గుంతకల్లు పట్టణంలోని అరవింద్ నగర్ ప్రాంతంలో 01/04/ 2022 న ఓ భర్త తన భార్యను హత్య చేసిన సంఘటన గురించి అనంతపురం జిల్లా స్పెషల్ కోర్టు న్యాయమూర్తి శోభారాణి తన తీర్పులో భాగంగా ముద్దాయికి జీవిత ఖైదీగా , 15వేల రూపాయల నగదును జరిమానా విధిస్తూ తీర్పునివ్వడం జరిగిందని గుంతకల్లు వన్ టౌన్ సిఐ మనోహర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గత 01/04/2022 తేదీన పట్టణంలోని అరవింద్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న సుబ్రహ్మణ్యం నాయక్ అనే వ్యక్తి తన భార్య కదిరి మండలం రాజువారి పల్లి తాండ గ్రామానికి చెందిన మూడే చంద్ర నాయక్ కుమార్తె ఎం అఖిలను (20) ను అతికిరాతకంగా హత్య చేసినట్లు న్యాయస్థానంలో 11 మంది సాక్షుల విచారంలో నేరం రుజువైందన్నారు. అందుకు తీర్పుగా న్యాయ మూర్తి ముద్దాయి అయినా సుబ్రహ్మణ్యం నాయక్ కు జీవితం ఖైదీ విధిస్తూ 15000 వేలు జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారన్నారు. నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తమ పోలీస్ శాఖ సిబ్బంది సాక్షులను న్యాయస్థానం ముందు హాజరు పరిచి నిందితులకు శిక్ష పడేలా కృషి చేశారని ఆయన అన్నారు.