
శాస్త్రోక్తంగా దురస్తంభం ప్రతిష్ట మహోత్సవం…
నవంబర్ 21: కూడేరు.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల పరిధిలోని కలగల్లు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో ధవస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. గ్రామంలో నిర్మితమైన శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో గ్రామ ప్రజల సహకారంతో శ్రీ అయ్యప్ప స్వాములు, శివ స్వామి ల మాలదారులు సమిష్టిగా ఆయా గురుస్వాములు డ్యామ్ వెంకటేష్, కలగల్లు గురుస్వామి ,తిరుస్వామి పర్యవేక్షణలో అత్యంత వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలగళ్ల ఈడిగ రామాంజనేయులు లతోపాటు పలువురు గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.