
ఈనెల 23,24 తేదీలలో ఓటరుగా నమోదు, తొలగింపులకు సువర్ణవకాశం…
తహసిల్దార్ రమాదేవి
నవంబర్ 22 గుంతకల్లు
గుంతకల్లు నియోజకవర్గం లో ఈనెల 23,24 వ తేదీలలో ఆయా పోలింగ్ కేంద్రాలలో బూతు స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఓటరుగా నమోదుతో పాటు తొలగింపు చర్యలకు సువర్ణ అవకాశం జిల్లా అధికారయంత్రాంగం కల్పించిందని గుంతకల్లు మండల తహసిల్దార్ రమాదేవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె తెలిపిన వివరాల మేరకు ప్రజలు నూతనంగా తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకొనుటకు ఓటరుగా నమోదు అవకాశం తో పాటు తొలగించుకుని అవకాశం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని గుంతకల్లు నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.