Monday, March 16, 2026
spot_img

ఉర్దూ హాస్టల్ ను ప్రారంభించండి…- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిమ్మారెడ్డి

ఉర్దూ హాస్టల్ ను ప్రారంభించండి….
— కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిమ్మారెడ్డి

నవంబర్ 22 : గుంతకల్లు

ఉర్దూ హాస్టల్ ను ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముసలి రెడ్డి తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పాత బస్టాండ్ నుండి మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి అనంతరం మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా తిమ్మారెడ్డి మాట్లాడుతూ…గుంతకల్లు పట్టణంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉర్దూ మీడియం హాస్టల్ పట్టణంలో టిడిపి ప్రభుత్వంలో నిర్మాణం జరిగింది. అయితే ఈరోజు వరకు హాస్టల్ సిబ్బంది కొరకు సుమారు తొమ్మిది సంవత్సరముల నుండి నియమించలేదు ఈ మైనార్టీ కాలేజ్ స్థలంను కొంతమంది వ్యక్తులు కబ్జా చేయడానికి పాల్పడుతున్నారని అన్నారు. అదే స్థలంలో మైనార్టీ ట్రస్ట్ కొనడం జరిగినది ఈ కాలేజీ ఆవరణంలో పిచ్చి మొక్కలు పెరిగి మద్యం పానం సేవిస్తూ అసాంఘిక కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయని అన్నారు. దయచేసి అధికారులు ఈ ఉర్దూ కాలేజీకి మైనార్టీ విద్య అభివృద్ధి కి సిబ్బంది కొరకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి నిధులు కేటాయించి ఉర్దూ కాలేజీ ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. లేనిచో ఈ ఉద్యమ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిరోజ్ ఖాన్ ,గురుఫరోష్ జిలాన్, ఖాదర్ వలీ ,తాహెర్, రామ్ రెడ్డి, మోహన్, కుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular