
విషాదం.. తలలోకి తూట దూసుకెళ్లి ఏఆర్ కానిస్టేబుల్ మృతి..
నవంబర్ 22 :గుంటూరు
గుంటూరులో ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) హెడ్ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తుండగా తుపాకీ పేలడంతో తలలోకి తూటా దూసుకెళ్లింది.. వంశీకృష్ణ అనే హెడ్ కానిస్టేబుల్.. అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. వెంటనే తోటి కానిస్టేబుళ్లు వంశీకృష్ణను జీజీహెచ్‌కు తరలించారు. అయితే ఈలోపే అతను మృతి చెందారని వైద్యులు తెలిపారు. తుపాకీ ప్రమాదవశాత్తు పేలిందా.. లేక వంశీకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. హెడ్ కానిస్టేబుల్ వంశీకృష్ణ మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది..