
శ్రీ చైతన్య పాఠశాల ఆధ్వర్యంలో సేఫ్ ఇండియా ర్యాలీ..
గుంతకల్లు టౌన్,
స్థానిక పి అండ్ టి కాలనీలో గల శ్రీ చైతన్య పాఠశాల గుంతకల్లు-2 విద్యార్థులచే శ్రీ చైతన్య యాజమాన్యం నిర్వహిస్తున్న స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం లో భాగంగా సేఫ్ ఇండియా కార్యక్రమం నిర్వహణకు ప్రజలలో రోడ్డు భద్రత- ప్రయాణీకులకు అవగాహన కోసం విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ని శ్రీ చైతన్య పాఠశాలల ఏ.జీ.ఎం సుబ్బారెడ్డి జండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నేటి కాలంలో నిరంతరము ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. సరైన ట్రాఫిక్ నియమ నిబంధనలు మరియు రోడ్ సేఫ్టీ విధానాలను పాటించకపోవడం ఇందుకు కారణమని తెలియజేశారు. అందరూ తూచా తప్పకుండా నియమాలను పాటించాలని చెప్పారు. స్థానిక పాఠశాల నుండి పి& టి కాలనీ ధర్మవరం గేట్ అక్కడి నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఇందులో భాగంగా స్థానిక వన్ టౌన్ సి ఐ బి మనోహర్ మాట్లాడుతూ విద్యార్థులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అందరికీ స్ఫూర్తిని ఇవ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న శ్రీ చైతన్య యాజమాన్యాన్ని ఆయన ప్రశంసించారు. విద్యార్థులు నినాదాలతో మరియు చిన్ననాటికతో ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ ర్యాలీలో కోఆర్డినేటర్ నాగభూషణం మాట్లాడుతూ ప్రయాణీకులు ప్రయాణ సమయంలో సరైన ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ మొదలైన రక్షణ పరికరాలను ధరించి ప్రయాణించాలన్నారు. ప్రిన్సిపాల్ పురుషోత్తం మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటించడం మనందరి బాధ్యత అని వాటిని అనుసరించి అందరూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి అని తెలియజేశారు. ఈ ర్యాలీలో పాఠశాల డీన్ జాన్, సి ఇంచార్జ్ ఖాదర్, ప్రైమరీ ఇంచార్జ్ హేమావతి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు.