ఆరుగురు జూదరులు అరెస్ట్….
రూ.59, 350 నగదు సీజ్..

నవంబర్ 23 గుంతకల్లు
జిల్లా ఎస్పీ జగదీష్ ఉత్తర్వుల మేరకు గుంతకల్లు డిఎస్పి ఆదేశాలతో పట్టణంలోనీ వన్ టౌన్ పరిధిలోని పలు ప్రాంతాలలో పేకాట స్థావరాలపై శనివారం సీఐ బి మనోహర్ తన సిబ్బందితో దాడులు చేపట్టారు. ఈ దాడుల నేపథ్యంలో ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ. 59 వేల 350 ల నగదును సీజ్ చేశారు. టౌన్ సిఐ తెలిపిన వివరాల మేరకు…. తాము చేపట్టిన దాడుల నేపథ్యంలో పట్టణంలోని ఆంథోనీ స్ట్రీట్, కూరగాయల మార్కెట్ సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులును అరెస్టు చేసి వారి వద్దనుండి రూ.59,350 ల నగదును సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. పట్టణంలో ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పేకాట, మట్కా, బెట్టింగ్ తదితర వ్యవహారాల లో పాల్గొన్నచో అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడునున్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేకమైన వ్యవహారాల సమాచారంను ఎవరైనా తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని పిలుపునిచ్చారు