
కే జీ వి జి ఎం ఆధ్వర్యంలో ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమం..
నవంబర్ 23 గుంతకల్లు
పట్టణంలో ఉన్నటువంటి హోటల్స్ బేకరీలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ చికెన్ సెంటర్స్ టీ స్టాల్స్ వ్యాపారులకు పాత గుంతకల్ లో ఉన్నటువంటి శ్రీ వాల్మీకి మహర్షి కళ్యాణమండపం నందు ఆహార భద్రత గురించి ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ ట్రైనర్ యశోద గారు ఆహార భద్రతపై శిక్షణ ఇవ్వడం జరిగినది .ఆహార విక్రయిత నిర్వాహకులకు అవగాహన కలిగిస్తూ నేటి సమాజంలో ప్రతి ఒక్క తినుబండారాలలో కల్తీ రావడం జరుగుతుంది కనుక ప్రజలకు మీరు సరైన శుభ్రత పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ఆహార భద్రత పాటిస్తూ తయారుచేసినటువంటి వాటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉందని అవగాహన లేకుండా నిర్వహించి ప్రజల ఆరోగ్యాలపై సరైన తిరుబండారాలు విక్రయించేలాగా చూడాలని కోరారు అలాగే వ్యాపారస్తులు ఫుడ్ లైసెన్స్ తో పాటు ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికెట్ పాటు ఫాస్ట్ ట్రాక్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాలని తెలియజేశారు ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్స్ జ్యోతి మరియు జింకల వేణుగోపాల్ వాల్మీకి అరుణకుమారి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.