
విద్యాసంస్థలకు హెచ్చరిక.. అలా చేస్తే రూ.15లక్షల ఫైన్!
అమరావతి :
రూల్స్ అతిక్రమించే ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది. స్టూడెంట్ కు ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వకపోతే, అధిక ఫీజులు వసూలు చేస్తే రూ.15లక్షల ఫైన్ విధించడం తో పాటు గుర్తింపును రద్దు చేసే అధికారం కమిషన్ కుఉంటుందని గుర్తుచేసింది. ఏవైనా సమస్యలుంటే 8712627318, 08645 274445 కు ఫిర్యాదు చేయొచ్చని విద్యార్థులకు సూచించింది.