
ఘనంగా ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జయంతి..
నవంబర్ 24 :గుత్తి
గుత్తి పట్టణంలో ని శ్రీసాయి కళాశాలలో రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ
తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు.
బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటంచేసి దేశం కోసం ఎన్నోపోరాటలు చెసి స్వతంత్ర సంగ్రామంలో రాయలసీమ యువతకి మార్గదర్శనం చేశారన్నారు.తన కొనఊపిరి వరకు దేశంకోసం పోరాటాలు చేసి చివరకు బ్రిటీషువాళ్ళ అక్రమ నిర్బంధం చేసి ఉరిశిక్ష విధించారు.కనుక ఇంతటి పొరతాయోధుడి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం నే ఆయన జయంతి వర్ధంతి వేడుకలు జరిపి సెలవుదినంగా ప్రకటించాలన్నారు.త్వరలోనే నరసింహారెడ్డి విగ్రహాన్ని నెలకొలెపుతాం అన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విమోచనసమితి అధ్యక్షుడు వై.రాజశేఖర్ రెడ్డి.గూటికోట సంరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి నాయకులు బీజేపీ కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు తిమ్మారెడ్డి నాయకులు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి ఎర్రగుడిగోపాల్ రెడ్డి విరూపాక్ష రెడ్డి జ్ఞానేశ్వర్ రెడ్డి రామరంగారెడ్డి హరినాథ్ రెడ్డి తురకపల్లి గోపాల్ రెడ్డి ప్రిన్సిపాల్ సుంకన్న తదితరులు పాల్గొన్నారు