
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఘనంగా కళాకారుల నృత్య పుష్పాంజలి…
నవంబర్ 24 గుంతకల్లు
గుంతకల్ పట్టణంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం కళామందిరంలో ఆదివారం సాయంత్రం తిరుపతికి చెందిన శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళ నృత్య సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో దేవాలయ అభివృద్ధి కమిటీ యాజమాన్యo వారి అధ్యక్షతన సాంస్కృతిక నృత్య కళాకారులు బళ్లారికి చెందిన కుమారి అవని గంగావతి, గుంతకల్లుకు చెందిన కుమారి బి హారిక ల సాంస్కృతిక నృత్యములచే శ్రీ స్వామివారి నృత్య పుష్పాంజలి కార్యక్రమం ఘనంగా జరిగింది. సదరు కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వర స్వామి వారి భక్తి పాటలతో కళాకారులు వారి నృత్యములు కళాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గుంతకల్లు శ్రీ వెంకటేశ్వర భక్తమండలి అధ్యక్షుడు ఎం భాస్కర్ రంగయ్య, కార్యదర్శి నారాయణస్వామి, కోశాధికారి సుధాకర్ గుప్త లతో పాటు ఆలయ ప్రధాన అర్చకుడు జనార్దన్ స్వామి, కళాకారుల గురువులు శ్రీ కైవల్య కృతి సంగీత నృత్యాలయం కు చెందిన ఎస్కే పద్షా, శ్రీ లలిత కళ హిందుస్తానీ సంగీత నృత్య అకాడమీకి చెందిన ఆర్కే శ్రీనివాస్ , లక్ష్మీ డాన్స్ అకాడమీకు చెందిన పోతుకుంట విజయ్, ఏకే డ్యాన్స్ స్టూడియోకు చెందిన అశోక్ కుమార్ లతో పాటు విశ్రాంత తాసిల్దార్ గుంతకల్లు జిఎంవి చలపతి తదితరులు పాల్గొన్నారు.