
మాజీ ఎమ్మెల్యే వైవీఆర్ త్వరగాకొలుకోవాలని పూజలు..
నవంబర్ 25 :గుంతకల్లు
గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆరోగ్యము త్వరగా మెరుగయ్యి నియోజకవర్గానికి రావాలని వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట వద్ద లక్ష్మీ వెంకటేశ్వర స్వామీ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్ లో చికిత్స పూర్తయ్యి ఆరోగ్యంగా తిరిగిరావాలని పూజలు చేశారు.అలానే నియోజకవర్గంలో పంటలు సమృద్ధిగా పండి రైతులు ఆనందంగా వుండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రామరంగారెడ్డి గోపాల్ రెడ్డి జ్ఞానేశ్వర్ ప్రహల్లాధ వేంకటేశ్వర్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.