
దళిత గిరిజనుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో గుండ్లపల్లి శాంతిరాణి కి ఘనంగా సన్మానం …
నవంబర్ 25 :గుంతకల్లు
అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణం, పట్టణానికి చెందిన సమాజ సేవకురాలు మరియు, అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అయినా గుండ్లపల్లి శాంతి రాణి విజయవాడలో జరిగిన అఖిల భారత దళిత గిరిజనుల బహుజన సంక్షేమ సంఘం ఆరవ వార్షికోత్సవానికి ప్రత్యేక ఆహ్వానితురాలుగా సభకు హాజరు కావడం జరిగింది,ఈ సందర్భంగా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, ఎనవల ఆంజనేయులు,శాంతిరాణిని ఉద్దేశించి మాట్లాడుతూ, సమాజంలో ఆమె చేస్తున్న సేవలు మరవలేనివని, అక్క అంటే నేనున్నానని భరోసా కల్పిస్తూ, ఉన్నదాంట్లోనే కొంచెం దానం చేస్తూ, మరి ముఖ్యంగా నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకురాలని,ఆమె చేసిన సోషల్ సర్వీసులను గుర్తించిన కొన్ని సంస్థలు ఆమెకు అవార్డు ప్రధానం చేయడం జరిగింది, మా సంస్థకు సమాజానికి ఆమె సేవలు, ఎల్లప్పుడు అవసరమని, అనునిత్యం న్యాయం కోసం పోరాడే, నాయకురాలు మన గుండ్లపల్లి శాంతిరాణి,అనితెలియజేశారుఅనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు, ఎనవల ఆంజనేయులు గారు, గుండ్లపల్లి శాంతిరాణి ఆది, దంపతులను, శాల్వా పూలమాలతో సంబంధించి, అవార్డు ప్రధానం చేశారు, అనంతరం శాంతిరాణి మాట్లాడుతూ, అన్ని జన్మలలో మానవ జన్మ ఉత్తమమైనదని, దాంట్లోనే సాటివారికి, సహాయపడుదాం, ఆపదలలో వున్నవారికి,మేము, మీకు అండగా ఉన్నామని ధైర్యాన్ని కలిపించండి, మరియు ఈ సభకు ఆహ్వానించి, సన్మానించిన, ఎనవల ఆంజనేయులు గారికి, ప్రతి ఒక్కరికి పేరుపేరునా, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు, ఈ కార్యక్రమంలో, రాష్ట్ర నలుమూలల నుంచి, నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.