
విశేష పూజలు అందుకున్న శ్రీ బుగ్గ సంగమేశ్వరుడు…
-కార్తీక దీపాల వెలిగింపుతో మ్రొక్కులు తీర్చుకున్న భక్తాదులు..
-విశేష అలంకరణలలో భక్తులకు దర్శనమిచ్చిన మూలవర్లు.
నవంబర్ 25: గుంతకల్లు.
సుప్రసిద్ధ దక్షిణ కాశీగా పిలవబడుతున్న శ్రీ బుగ్గ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం నాలుగో సోమవారం భక్తజనులుతో విశేష పూజలతో అభిషేకాలతో శ్రీవార్ల మూరవర్లను దర్శించుకున్నారు. గుంతకల్లు మండలం సంఘాల గ్రామం సమీపంలో రాయల కాలం నాటి అతి పురాతన ఆలయంగా వెలసిన శ్రీ బుగ్గ సంగమేశ్వర దేవస్థానం ఒకటి ఇటీవల రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ప్రత్యేక గుర్తింపును పొందిన దేవాలయం. శివునికి అతి ప్రీతికరమైన మాసంగా కార్తీకమాసం విశిష్టత ఉంది. భక్తులు కార్తీక మాసంలో శ్రీ బుగ్గ సంగమేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహణతో కార్తీక దీపముల వెలిగించి తమ తమ మ్రొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా ఉంది. ఈ క్రమంలో కార్తీక మాసంను పురస్కరించుకుని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తజనులు భక్తీ ప్రవర్తలతో శ్రీ స్వామివారి దర్శనార్థం వేకువజామున నుండే తరలివస్తు స్వామివారి సేవలో పునీతులై తమ తమ మృక్కులను తీర్చుకున్నారు.