
నిత్య అన్నదాన సేవకు ఓదాత ఒక లక్ష రూపాయలు దాతృత్వం…
-ఒకరోజు నిత్య అన్నదాన సేవకు గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే రామగౌని వారి కుటుంబం దాతృత్వం..
నవంబర్ 25 :గుంతకల్లు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పిలవబడుతున్న శ్రీ బుగ్గ సంగమేశ్వర దేవస్థానమునకు నిత్య అన్నదాన సేవ నిమిత్తం పలువురు దాతలు తమ దాతృత్వంను చాటుకున్నారు. ఈశ్వరునికి అతి ప్రీతికర మాసం కార్తీక మాసంను పురస్కరించుకొని దేవస్థానం లోని శ్రీ బుగ్గ సంగమేశ్వర స్వామి, శ్రీ పార్వతీదేవి వార్ల మూలవరులకు కార్యనిర్వహణాధికారి ఏ. కృష్ణయ్య పర్యవేక్షణలో ఆలయ అర్చక బృందం విశేషంగా పంచామృత అభిషేకాలతో పాటు ప్రత్యేక అలంకరణలు గావించి పూజలు నిర్వహించారు. సదరు పూజా కార్యక్రమాలకు వివిధ ప్రాంతంల నుండి భక్తులు విరివిగా పాల్గొని ఆలయ ప్రాంగణంలోని అశ్వర్థ వృక్షం వద్ద కార్తీకదీపాలను వెలిగించి తమ తమ మ్రొక్కులను తీర్చుకున్నారు. ఈ క్రమంలో అనంతపురం పట్టణమునకు చెందిన మాల్కరి ఆనందరావు అనే విశ్రాంత ఉపాధ్యాయడు తన కుటుంబంతో విచ్చేసి నిత్య అన్నదానం సేవకు గాను లక్ష రూపాయలు విరాళంగా ఆలయ అధికారులకు అందజేసి తన దాతృత్వమును చాటుకున్నారు. ఈ సందర్భంగా పురస్కరించుకొని దాతలకు శ్రీవారి ప్రసాదంగా శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి మూలవర్ల దర్శన భాగ్యం కల్పించి వేదమంత్రాలతో శ్రీవారి ఆశీర్వాదాలు అందజేసి అందజేశారు. అలాగే గుంతకల్లు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామగౌని జితేంద్ర గౌడ్ తోపాటు రామ గౌని సోదరుల కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకుని భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఒకరోజు వారి దాతృత్వమును అందజేసి తమ భక్తి ని చాటుకున్నారు.