
సాగు చేస్తున్న పేదలకు న్యాయం చేయండి…
సిపిఎం పార్టీ
నవంబర్ 25 :కూడేరు.
అనంతపురం జిల్లా కూడేరు మండలం పరిధిలోని సర్వే నంబర్ 535 లోసాగు చేస్తున్న ప్రతి పేద రైతుకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నాయకుడు ఎం కృష్ణమూర్తి డిమాండ్ చేశాడు. సోమవారం స్థానిక మండల రెవెన్యూ కార్యాలయము ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేద రైతులతో సంయుక్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ సర్వేనెంబర్ 535లో 40 సంవత్సరాలు నుండి సాగు చేసుకుంటున్నా చట్ట ప్రకారం లబ్ధిదారులగా గుర్తించి పత్రాలను అర్హత పత్రాలను అందజేయాలని డిమాండ్ చేశారు. కూడేరు, అరవకూరు , కడదర కుంట మొదలగు గ్రామాలకు చెందిన నిరుపేదలు సర్వేనెంబర్ 535లో గత 40 సంవత్సరాల క్రితం పెద్దపెద్ద కొండలు, గుట్టలను చదును చేసుకుని వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్ది వివిధ పంటల సాగుతో జీవనం సాగిస్తున్నారు. కాగా నాటి నుండి పలుమార్లు అర్జీలతో రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ విధులను నిర్వహిస్తున్న అధికారులను వేడుకున్నా వారి పట్ల న్యాయం కల్పించడంలో నిర్లక్ష్యం చేసిన తీరుండడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాగు చేస్తున్న బాధిత రైతులకు న్యాయం చేస్తూ వారికి 2013 భూ సేకరణ చట్టం అమలు ప్రకారం భూమి పట్టాలను అందజేసి న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులైన రైతుల సమీకరణతో దశలవారీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తదుపరి రైతుల పట్ల న్యాయం కోరుతూ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎస్. కరీంసాబ్, సహాయ కార్యదర్శి కే. వెంకటేశ్వర్లు నాయకులు, చిదంబరమ్మ, అలివేలమ్మ, శ్రీనివాసులు, రామాంజనేయులు ,గంగాధర, చౌడన్న, పరమేష్, అమ్మ దుర్గాదేవి తదితరులతో పాటు సాగుదారులు పాల్గొన్నారు.