
అభివృద్ధి భారతదేశానికి నాంది రాజ్యాంగ పీఠిక…
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ
నవంబర్ 26 : 75వ “భారత రాజ్యంగ దినోత్సవ” సందర్భంగా స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణం ఎదుట ఉన్న డాబిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో మొదటగా డా.బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలుతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ పీఠికలో “భారత ప్రజలమైన మేము” అనే పదాలతో మొదలయ్యే ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం, ఈ రోజు (నవంబర్ 26) న చట్ట సభల్లో అమోదించబడిన సందర్భంగా మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. రాజ్యాంగంలోని అంశాల సారాంశాన్ని, రాజ్యాంగ రూపకర్తల ఆశయాల సాధనకై మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ మహామనుషుల అడుగుజాడల్లో నిడిచి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, సామాజిక న్యాయాన్ని, మహిళా సాధికారకతను, లింగ సమానత్వాన్ని, సంక్షేమం – అభివృద్ది, గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్రాన్ని నడిపించారని, ప్రస్తుతం రాజ్యాంగ విలువలు సమాజంలో సన్నగిల్లుతున్నాయని, ప్రభుత్వాలు రాజ్యాంగ బద్దంగా నడుచుకుంటూ, రాజ్యంగా స్పూర్తిని కొనసాగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురము నగర పాలక సంస్థ మేయరు, డిప్యూటి మేయర్లు, కార్పొరేటర్లు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు.