
మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహణపై సచివాలయాల సిబ్బందితో కలెక్టర్ సమావేశం… నవంబర్ 26 బాపట్ల.
నవంబర్ 26 : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా తల్లిదండ్రుల కమిటీలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహణపై సచివాలయాల సిబ్బందితో మంగళవారం స్థానిక పురపాలక సంఘం సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు. విద్యార్థుల జీవితాలు మెరుగుపడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుందని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 7వ తేదీన బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారన్నారు. విద్యార్థుల గృహాలకు వెళ్లి వారి తల్లిదండ్రులను ఘనంగా ఆహ్వానించాలన్నారు. సమావేశం ప్రాధాన్యతను వివరించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును మార్చే సమావేశాల ముఖ్య ఉద్దేశంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, సచివాలయాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.