Wednesday, July 30, 2025
spot_img

పిజిఆర్ఎస్ లో వచ్చే ప్రతి అర్జీని అధికారులు నిశిత పరిశీలనతో పరిష్కరించాలి …జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి.

పిజిఆర్ఎస్ లో వచ్చే ప్రతి అర్జీని అధికారులు నిశిత పరిశీలనతో పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి

నవంబర్ 26 : పిజిఆర్ఎస్ లో వచ్చే ప్రతి అర్జీని అధికారులు నిశిత పరిశీలనతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆదేశించారు. పి జి ఆర్ ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) అమలు తీరుపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో మంగళవారం వీక్షణ సమావేశం ద్వారా కలెక్టర్ సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసిన అర్జీలకు అధిక ప్రాధాన్యత నివ్వాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి అర్జీని గడువులోగా పరిష్కరించాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. గడువు దాటితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మార్టూరు, బాపట్ల మండలాలలో పెండింగ్ లో ఉన్న అర్జీలపై ఆరా తీశారు. జాప్యంపై వివిధ మండలాల అధికారులను నిలదీశారు. అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు నాణ్యతతో సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. నీటి తీరువా పన్ను వసూలు లక్ష్యం మేరకు సేకరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బాపట్ల రెవిన్యూ డివిజన్ పరిధిలో రూ.3.40 కోట్లు బకాయిలు ఉండగా, చీరాల డివిజన్ లో రూ.5.24 కోట్లు, రేపల్లె డివిజన్లో రూ.4.83 కోట్లు బకాయలు ఉన్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా రూ.13.47 కోట్లు బకాయిలపై అధికారులు దృష్టి సారించాలన్నారు. వి ఆర్ ఓ లకు లక్ష్యాలు నిర్దేశించి వసూలు చేయాలన్నారు. ఇందుకోసం అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీవోలు పి గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular