
కర్నూల్ DPO కార్యాలయ ఆవరణంలో కార్తీక మాస వన భోజన మహోత్సవం …
నవంబర్ 27: కర్నూలు.
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం కార్తీక మాస వన భోజన మహోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు పరిపాలన శాఖ ఉద్యోగులు ఈ రోజు మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో కార్తీక మాస వన భోజన మహోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ హాజరై (ధాత్రి నారాయణ) అమలకి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం ఆయనతోపాటు పోలీసు మినిస్టీరియల్ సిబ్బంది అంతా ధాత్రి నారాయణ చెట్టు కింద వనభోజనం చేశారు. ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ధాత్రీ నారాయణ చెట్టు కింద భోజనం చేయడం మంచిదని, ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులతో జరుపుకొని సంతోషంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఏడీఎంఎన్) హుస్సేన్ పీరా, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.