
జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన గిద్దలూరు యువకుడు..
నవంబర్ 29 ; ప్రకాశం
ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసి ఖ్వాజా రహీం జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రహీం మేనమామ అయిన 12వ వార్డు మాజీ కౌన్సిలర్ అల్తాఫ్ సహకారంతో ప్రయోజకుడుగా మారాడు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి విద్యను రహీం అభ్యసించాడు. ఇటీవల పరీక్షలు రాసిన రహీం పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యాడు. పలువురు రహీమ్ ని అభినందిస్తుండగా తన అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన మేనమామతో పాటు కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటానని అన్నారు.