Wednesday, July 30, 2025
spot_img

కడప ఉక్కు పరిశ్రమ సాధించాలి – డివైఎఫ్ఐ

కడప ఉక్కు కోసం రాష్ట్ర ఎంపీలు రాజీనామ చేసైనా కడప ఉక్కు పరిశ్రమ సాధించాలి – డివైఎఫ్ఐ

నవంబర్ 29 : కడప

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో విభజన హామీలలో భాగమైన కడప ఉక్కు పై చర్చ జరిపి అవసరమైతే ఈ రాష్ట్ర ఎంపీలు రాజీనామా చేసైన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ ) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని, వీరణాల, శివకుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక బద్వేల్ పట్టణంలోని సుందరయ్య భవనం నందు డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు పై నిర్లక్ష్యం వహిస్తున్నది అన్నారు. విభజన హామీలలో భాగమైన కడప ఉక్కు పై ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు నిర్మించలేదు అని ప్రశ్నించారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో చదువుకున్న యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక గల్ఫ్ లాంటి దేశాలకు వలసలు పోతున్నారు.మరికొందరు ఇతర రాష్ట్రాలలో పనులకు వెళుతున్నారు అన్నారు. కరువుతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతంలో ఉపాధి పరిశ్రమలు చాలా అవసరం అన్నారు. అందులో ఉక్కు పరిశ్రమ లాంటి భారీ పరిశ్రమ వస్తే ఎక్కువ సంఖ్యలో యువతకు ఉపాధి లభించే అవకాశం వుంటుంది.కానీ అన్నీ వున్న అల్లుడి నోట్లో శని అన్న చందండ కడప ఉక్కు పరిశ్రమ పరిస్థితి తయారైంది అన్నారు. ముఖ్యమంత్రులు అందరూ రాయలసీమ ప్రాంత వాసులేనని ముఖ్యమంత్రులు మారుతున్న, వాళ్ళు వేసిన శిలాఫలకాలు మారుతున్న కడప ఉక్కు పునాది రాయి ముందుకు కదలడం లేదన్నారు. శిలాఫలకాలు సమాధిరాళ్ళ లెక్క వెక్కిరిస్తున్నాయి అన్నారు. గడిచిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం కడప ఉక్కు కు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోంది అన్నారు. మన రాష్ట్ర,ప్రాంత ఎంపీలు ప్రాంత భవిష్యత్ కోసం,యువతకు ఉపాధి కోసం పార్లమెంటులో గలమెత్తాలి అన్నారు. కేంద్రం పై ఒత్తిడి తెచ్చి కడప ఉక్కు కు నిధులు సాధించాలని అన్నారు. లేకుంటే ఇక్కడి ప్రాంత యువత, ప్రజలు క్షమించరు అన్నారు ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు రాష్ట్రమంతా ఒకే నినాదంతో నినదించి విశాఖ ఉక్కును సాధించారో ఆ స్ఫూర్తితోనే కడప ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంగా రాష్ట్రమంతా నిలిచి యువత పోరాడి కడప ఉక్కును సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్, షరీఫ్, ఎస్ కే ఆదిల్, నాగేంద్ర, ఇంద్ర, సురేష్, ఖలీల్ భాష, రామకృష్ణ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular