
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే చాలా ముఖ్యం
సైబర్ నేరాల నియంత్రణకు డయల్ 1930 నంబర్ పై ప్రజలకు అవగాహన
కరపత్రాలతో ప్రజలకు అవగాహన చేస్తున్న పోలీసులు
సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్న పోలీసులు
జిల్లా ఎస్పీ ఆదేశాలతో సైబర్ నేరాల నియంత్రణకు కర్నూలు పోలీసుల చర్యలు
కర్నూలు క్రైం : నవంబర్ 29
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే చాలా ముఖ్యమని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ జిల్లా ప్రజలకు శుక్రవారం తెలిపారు.సైబర్ నేరాల పై ఏర్పాటు చేసిన డయల్ 1930నంబర్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.ఈ సంధర్బంగా శుక్రవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి పోలీసుస్టేషన్ పరిధులలో పోలీసు అధికారులు, సిబ్బంది సైబర్ నేరాల నియంత్రణకు,కట్టడికి సైబర్ నేరాల అవగాహన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.ప్రజలు వాటిని చూసి చదువుకునేందుకు వీలుగా ముద్రించారు. ఆయా డిగ్రీ కళాశాలలు , యూనివర్సిటీలలో,రద్దీ ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలలో,గ్రామ సచివాలయాలలో,రైల్వేస్టేషన్ లలో బస్టాండ్ లలో జనం రద్దీగా ఉండే చోట్ల ప్రజలకు పంచుతున్నారు.ఒక్క రోజే దాదాపు ఎనిమిదివేల మందికి సైబర్ నేరాల అవగాహన కరపత్రాలను జిల్లా పోలీసులు పంచి,ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం నేటి నుండి నిరంతరం కొనసాగుతుందన్నారు.సైబర్ నేరాలపై అవగాహన కల్పించడమే కాకుండా వాటిని ఎలా అరికట్టవచ్చో కూడా ప్రజలకు వివరిస్తున్నారు.ఎట్టి పరిస్ధితుల్లోనూ తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను ఒపెన్ చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరికి వాటి పట్ల అవగాహన అవసరమని పోలీసులు చెబుతున్నారు.సైబర్ నేరగాళ్ళు చేసే మోసాల పట్ల చాలా మందికి అవగాహన లేకపోవడంతో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అప్రమత్తo చేస్తున్నారు.
ఆన్ లైన్ లావా దేవీలు చేసే క్రమంలో టెక్నాలజీని వాడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని,సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే స్వీయ అప్రమత్తత ముఖ్యం అని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.