
శ్రీ నెట్టికంటుని హనుమద్ వ్రత పూజకు ఓ ధాత వెండి వస్తువుల దాతృత్వం…
నవంబర్ 29:గుంతకల్లు
పవిత్ర పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంకు ఓ ధాత కుటుంబం దాతృత్వంను చాటుకున్నారు. శుక్రవారం దేవస్థానం కార్యాలయంలో ఆలయ సహాయ కార్య నిర్వహణాధికారి ఓంకారం వెంకటేశ్వరుడు తెలిపిన వివరాల మేరకు… శ్రీ నెట్టికంటుని సన్నిధిలో జరుపబోవు శ్రీ హనుమద్ వ్రతము కార్యక్రమ పూజలకు గాను కసాపురం గ్రామ వాస్తవ్యులైన జి రమాదేవి అనే భక్తురాలు దాతృత్వంగా 002-165-000 గ్రాముల రజతం (వెండి) వస్తువులుగా ఓ ప్లేటు, ఓ శటారి, రెండు తీర్థం గిన్నెలు, ఐదు చిన్న పంచ పాత్రలుతో పాటు రెండు ఉద్దరినిల వస్తువులను ఓ ధాతగా తమ కార్యాలయంకు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు పి. వెంకటేశులు పాల్గొన్నారు.ఈ క్రమంలో ధాతలకు శ్రీస్వామి వారి మూలవరుల దర్శనార్థంతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించి ఆలయ సాంప్రదాయానుసారంగా శ్రీవారి జ్ఞాపకార్థంగా శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదములను అందజేశామన్నారు.